శ్రీరాంపూర్ ఏరియాలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి : డీజీఎం(పి) అరవిందరావు

శ్రీరాంపూర్ ఏరియాలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి : డీజీఎం(పి) అరవిందరావు

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియా, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డీజీఎం(పి) అరవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ చార్జింగ్(రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ), ఏసీ ఇన్​స్టాలేషన్ అండ్​వాటర్ ప్యూరిఫైయర్ నిర్వహణ, మరమ్మతులు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ డిష్ వాషర్, ఎల్​టీవీ, ఓఎల్ఈడీ మానిటర్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి కోర్సులను హైదరాబాద్​కుషాయిగూడ ఈఎస్ఎస్​సీఐ వారు ఉచితంగా నేర్పిస్తారన్నారు.

టెన్త్, ఇంటర్​పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవాలని, కోర్సు అనంతరం సర్టిఫికెట్​ఇచ్చి, ఉపాధి చూపిస్తారని పేర్కొన్నారు.  పూర్తి వివరాలకు శ్రీరాంపూర్ వృత్తి శిక్షణ  కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.