సీఎం కేజ్రీవాల్ తీర్థయాత్ర యోజన పథకం

సీఎం కేజ్రీవాల్ తీర్థయాత్ర యోజన పథకం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక స్కీంను ప్రకటించారు. 60 ఏళ్లకు పైబడిన వారి కోసం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన  పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్లను ఫ్రీగా అందించనుంది. దీని కోసం ఢిల్లీ సర్కార్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే.. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. 

ఇప్పుడు డిసెంబర్ 3 వ తేదీ నుంచి ఈ పథకం  అమలు కానుంది. డిసెంబర్ 3 వతేదీన ఢిల్లీ నుంచి అయోధ్యకు మొదటి రైలు బయలుదేరబోతున్నది. సుమారు 1,000 మంది ప్రయాణికులతో ఈ రైలు అయోధ్యకు ప్రయాణించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ పథకం ద్వారా రైల్లో ప్రయాణించేవారికి సంబంధించి మార్గదర్శకాలు, పథకానికి ఎలా ధరఖాస్తు చేసుకోవాలి తదితర విషయాలను ఇప్పటికే ఢిల్లీ సర్కార్ రిలీజ్ చేసింది. 60 ఏళ్లు నిండిన భార్యభర్తలతో పాటుగా, వారికి తోడుగా 21 ఏళ్లు కంటే తక్కువ వయసున్న ఒకరిని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.  ఢిల్లీ నుంచి దేశంలో ఎక్కడెక్కడికి  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది..ఎన్ని రోజులు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది అనే విషయాలను ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.