French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ డ్రా విడుదల.. తొలి రౌండ్ లోనే నాదల్‌కు టఫ్ ఫైట్

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ డ్రా విడుదల.. తొలి రౌండ్ లోనే నాదల్‌కు టఫ్ ఫైట్

సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం (మే 26) నుంచి ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధిన డ్రా ను తాజాగా విడుదల చేశారు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ రఫెల్ నాదల్ కు తొలి రౌండ్ లోనే కష్టమైన డ్రా ఎదుర్కొన్నాడు. ఆదివారం (మే 26) మొదటి రౌండ్‌లో ప్రపంచ నం.4 అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత సీజన్ లో గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నాదల్.. ఈ ఏడాది తన ఫేవరేట్ కోర్ట్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 

నాదల్, జొకోవిచ్ ఒకే డ్రా లో ఉండడం విశేషం. జొకోవిచ్ టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నాడు. ఈ సెర్బియా ఆటగాడు తొలి రౌండ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రంట్ పియర్-హ్యూగ్స్ హెర్బర్ట్‌తో ఆడతాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే కెరీర్ లో 25 వ గ్రాండ్ స్లామ్ ను తన ఖాతాలో వేసుకుంటాడు. సిన్నర్, అల్కరాజ్ వరుసగా రెండు మూడు సీడెడ్ లు లభించాయి. జానిక్ సిన్నర్ తన మొదటి రౌండ్ లో క్రిస్టోఫర్ యూబ్యాంక్స్‌తో తలపడుతుండగా.. నం.3 కార్లోస్ అల్కరాజ్ క్వాలిఫైయర్‌తో తలపడనున్నాడు.