
ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటికి నిన్న సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో భారీగా పెరిగిన కేసులతో.. ఆయా దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పుడు ఇదే దారిలో చైనా, థాయ్ లాండ్ కూడా చేరాయి. ఆసియాలోని నాలుగు దేశాల్లో కరోనా కేసులు భారీగా వస్తుండటం ఆయా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. సింగపూర్ లో 14 వేల కరోనా కేసులు నమోదు అయితే.. 30 శాతం మంది ఆస్పత్రిలో చేరి మరీ చికిత్స తీసుకుంటున్నారు. కొంత మంది చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నాలుగు దేశాల్లో కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా
చైనాలో కోవిడ్ సంఖ్యలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవలి వారాల్లో టెస్టింగ్ పాజిటివిటీ రేట్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
థాయిలాండ్
థాయిలాండ్‌లో ఏప్రిల్‌లో జరిగిన సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కరోనా కేసులు పెరిగాయి.
హాంగ్ కాంగ్
ప్రస్తుతం చేస్తున్న కొవిడ్ టెస్టుల్లో అత్యధికంగా పాజిటివ్ రావటంతో కేసులు ఏడాది గరిష్ఠాలకు చేరాయని హాంకాంగ్ అధికారులు చెబుతున్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావితం చేసిన కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని డేటా చెబుతోంది. ప్రస్తుతం 70 లక్షల మంది నివసిస్తున్న నగరంలో పరిస్థితులు చేజారి గతంలో స్థాయికి చేరలేదని అయితే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వెల్లడైంది. శ్వాసకోశ నమూనాలను పరీక్షించడంలో పాజిటివ్‌గా తేలిన వారి శాతం మార్చిలో 1.7% నుంచి 11.4%కి పెరిగింది. - ఆగస్టు 2024 గరిష్ట స్థాయి కంటే కూడా ఇది ఎక్కువ.
సింగపూర్
సింగపూర్ నగరంలో కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెలలో కరోనా కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. మార్చి 3 నాటికి కేసుల సంఖ్య 14వేల 200గా ఉన్నట్లు ప్రకటించింది. రోజూ వైరస్ భారీన పడటం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న వ్యక్తుల సంఖ్య 30 శాతం వరకు పెరిగింది. అయితే ప్రస్తుతం సివియర్ కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని హెల్త్ అధికారులు వెల్లడించారు
ALSO READ | ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాన్... భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత