
హుజూర్ నగర్, వెలుగు: ఎక్సైజ్ అధికారుల దాడుల్లో 2,250 కిలోల నల్లబెల్లం పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం లాలితండాకు చెందిన భూక్య రవి, మంచ్యాతండాకు చెందిన రూపావత్ కిషన్, రూపావత్ రంగ, గుర్రంపోడు తండా కు చెందిన మూడవత్ బాల సారా తయారు చేసే వారికి నల్లబెల్లం సరఫరా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున వారి ఇళ్లపై దాడులు నిర్వహించగా.. 2,250 కేజీల నల్ల బెల్లం, 10 లీటర్ల నాటు సారా దొరికింది.
బెల్లం, సారాతో పాటు మూడవత్ బాల, రూపావతు రంగలకు చెందిన రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు వెంకన్న జగన్మోహన్ రెడ్డి, దివ్య, కానిస్టేబుల్లు నాగయ్య, మధుసూదన్ రెడ్డి, రవి, నాగరాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.