
లాంగ్ జర్నీలు చేసే టైంలో అప్పుడప్పుడు కూల్ డ్రింక్ తాగాలి. వర్షం కురిసినప్పుడు గరం గరం శ్నాక్స్ తినాలి అనిపిస్తుంటుంది. అనిపించిన వెంటనే అలాంటివి దొరకడం కాస్త కష్టమే. కానీ.. ఇలాంటి ఫ్రిడ్జ్‌ని కారులో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూల్‌డ్రింక్స్ తాగొచ్చు, శ్నాక్స్ తినొచ్చు. కిలిగ్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ మినీ ఫ్రిడ్జ్ కారు బ్యాటరీ సప్లై చేసే 12 వోల్డ్స్ పవర్‌తో కూడా పనిచేస్తుంది.
దీన్ని వార్మర్‌లా కూడా వాడుకోవచ్చు. థర్మోస్టాట్ కంట్రోల్‌తో 50–65 సెంటీగ్రేడ్‌ల వరకు వేడెక్కుతుంది. సమోసాలు, శ్నాక్స్ లాంటివాటిని వేడి వేడిగా తినొచ్చు. ఇది 8 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. 2.18 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒకే బటన్‌తో కూలింగ్, వార్మింగ్ మోడ్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏసీ కరెంట్‌తో కనెక్ట్ చేసి ఇంట్లో కూడా వాడుకోవచ్చు.
ధర : రూ. 5,000