నిర్మల్, వెలుగు: స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేసిన ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీవాణి బుధవారం తీర్పునిచ్చారు. ఎస్పీ జానకి షర్మిల కేసు వివరాలను వెల్లడించారు.
2017లో ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ కు చెందిన ధర్మపురి, కుంచపు గంగాధర్ కలిసి స్నేహితుడి భార్యను అపహరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.
నిందితులపై నేరం రుజువు కావడంతో 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ కె వినోద్ రావు, విచారణ అధికారులు ఎ అశోక్, డ్యూటీ ఆఫీసర్లు దలుసింగ్, ప్రభాకర్ ను ఎస్పీ అభినందించారు.
