లాల్‌బాగ్చా రాజాను దర్శించుకున్న రష్మిక మందన్న

లాల్‌బాగ్చా రాజాను దర్శించుకున్న రష్మిక మందన్న

ముంబైలోని లాల్‌బాగ్చా రాజా గణేషుడిని పలువురు  సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టార్ హీరో అజయ్ దేవగన్ తన కుమారుడు యుగ్  తో  కలిసి గణేశుడిని  దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాడు.

హీరోయిన్  రష్మిక మందన్న కూడా లాల్‌బాగ్చా రాజా గణేషుడిని దర్శించుకుంది. తన రాబోయే చిత్రం 'గుడ్‌బై' పోస్టర్‌ను గణేషుడి పాదాలపై ఉంచి ఆమె ఆశీర్వాదం తీసుకుంది. రష్మిక వెంట చిత్ర నిర్మాత  ఏక్తాకపూర్, నటి నీనా గుప్తా ఉన్నారు. 

హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేషుడు ఎంత ఫేమసో... ముంబైలో లాల్‌బాగ్చా రాజా అంత ఫేమస్.. ఇక్కడ వినాయకుడిని చూసేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా లాల్‌బాగ్ రాజా గణపతి విగ్రహాన్ని 12 అడుగుల ఎత్తులో తయారు చేశారు. ఈసారి గణేశుడు సింహాసనంపై  కూర్చుని ఉన్నాడు. గత ఎనిమిది దశాబ్దాలుగా కాంబ్లీ కుటుంబం లాల్ బాగ్చా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.