సైబర్ స్కెచ్: కో అపెక్స్‌‌ బ్యాంక్‌‌ నుంచి కోట్లు మాయం

V6 Velugu Posted on Jul 16, 2021

  • టోలీచౌకీ అడ్డాగా  నైజీరియన్ సైబర్ స్కెచ్
  • చందానగర్‌‌‌‌, సికింద్రాబాద్‌‌  బ్రాంచీల నుంచి ట్రాన్సాక్షన్స్​
  • చందానగర్‌‌కు చెందిన ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌ కో అపెక్స్‌‌ బ్యాంక్‌‌ నుంచి రూ.1.97 కోట్లు కొట్టేసిన ఇద్దరు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బ్యాంక్ పాస్‌‌ బుక్స్, డెబిట్​కార్డ్స్‌‌, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్‌‌తో కలిసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి చందానగర్‌‌‌‌కు చెందిన యాసిన్ భాషా(23), మహ్మద్‌‌ రఫీ(22) టోలీచౌకీలో వెస్ట్రన్ మనీ ట్రాన్స్‌‌ఫర్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే నైజీరియన్‌‌ మనీ ట్రాన్స్‌‌ఫర్స్‌‌ కోసం యాసిన్ భాషా వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌లో డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. కొట్టేసిన డబ్బులో10 శాతం నైజీరియన్‌‌కి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ప్లాన్‌‌లో భాగంగా టీఎస్‌‌ కో ఆపరేటీవ్‌‌ అపెక్స్‌‌ చందానగర్‌‌‌‌ బ్రాంచ్‌‌లో ఈ నెల2న యాసిన్‌‌, రఫీ అకౌంట్స్‌‌ ఓపెన్‌‌ చేశారు. సికింద్రాబాద్‌‌ బ్రాంచ్‌‌లో చక్రి అనే మహిళ పేరుతో మరో అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేశారు.

ఈ క్రమంలోనే కో ఆపరేటీవ్‌‌ అపెక్స్‌‌ బ్యాంక్‌‌కి చెందిన సర్వర్స్‌‌ను నైజీరియన్ హ్యాక్ చేశాడు. బెనిఫిషియరీ  అకౌంట్స్‌‌ క్రియేట్‌‌ చేశాడు. చందానగర్‌‌‌‌, సికింద్రాబాద్‌‌ కో అపెక్స్‌‌ బ్రాంచీల నుంచి మహిళ అకౌంట్‌‌లోకి రూ.1.94 లక్షలు ట్రాన్స్‌‌ఫర్ చేశాడు. మరో 2 లక్షలు యాసిన్ భాషా అకౌంట్‌‌లోకి ట్రాన్స్‌‌ఫర్ చేశాడు. ఇలా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు రూ.1,96,88,136 ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశాడు. జరిగిన మోసాన్ని కోఠి ట్రూప్ బజార్‌‌‌‌లోని హెడ్‌‌ ఆఫీస్‌‌ సిబ్బంది గుర్తించారు. మొత్తం 102 ట్రాన్సాక్షన్స్‌‌తో ఐసీఐసీఐ,హెచ్‌‌డీఎఫ్‌‌సీ,ఫెడరల్‌‌ బ్యాంక్‌‌, ఐడీఎఫ్‌‌సీ, కొటాక్ మహీంద్ర బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌లోని మనీ ట్రాన్స్‌‌ఫర్స్‌‌ను టెక్నికల్‌‌ వింగ్ ట్రేస్ చేసింది. డిప్యూటీ జనరల్‌‌ మేనేజర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ రావు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్‌‌ చేశారు. బ్యాంక్ అకౌంట్స్‌‌ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నైజీరియన్‌‌ కోసం గాలిస్తున్నారు.

Tagged Hyderabad, Nigerian, , Cyber ​​Sketch, Co Apex Bank

Latest Videos

Subscribe Now

More News