వన్‌ప్లస్, ఒప్పో నుండి రియల్‌మీ వరకు నవంబర్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

వన్‌ప్లస్, ఒప్పో నుండి రియల్‌మీ వరకు నవంబర్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

ఈ నవంబర్ నెల స్మార్ట్‌ఫోన్  ప్రియులకు ప్రత్యేకంగా మారబోతోంది. ఎందుకంటే వన్ ప్లస్, నథింగ్, ఒప్పో, రియల్ మీ, ఐకూ వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్  చేయబోతున్నాయి. వీటిలో కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కాగా, మరికొన్ని మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. ఈ నెలలో రాబోతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.... 

నథింగ్ ఫోన్ (3a) లైట్
లండన్‌కు చెందిన టెక్ కంపెనీ నథింగ్  మొదటి బడ్జెట్ ఫోన్, 3a లైట్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్,  మ్యాట్ ఫినిష్ డిజైన్‌తో ఉంటుంది. నలుపు, తెలుపు రెండు కలర్స్ లో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, MediaTek  Dimensity 7300 Pro ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, నథింగ్ OS 3.5 ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కంపెనీ ఇంకా ఇండియాలో దీని లాంచ్ తేదీ లేదా ధరను వెల్లడించలేదు, కానీ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ 15
OnePlus కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 15న ఇండియాలో లాంచ్ కానుంది. ఈసారి కంపెనీ గొప్ప డిజైన్ మార్పు చేసింది. కెమెరా మాడ్యూల్ ఇకపై గుండ్రంగా కాకుండా చతురస్ర ఆకారంలో ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే  50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా, ఆక్సిజన్ OS 16తో నడుస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 7,300mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.70వేలు ఉంటుందని అంచనా.   

ఐక్యూఓ 15
వివో సబ్-బ్రాండ్ iQoo నవంబర్ 26న ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో  వస్తుంది.  144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, కెమెరా గురించి చెప్పాలంటే  50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌  ఉంది (మెయిన్, అల్ట్రా-వైడ్ అండ్ టెలిఫోటో). ఫోన్ ఆరిజిన్ OS (ఆండ్రాయిడ్ 16 ఆధారంగా) పై నడుస్తుంది. ఫోన్ ధర రూ.55 వేల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.  

రియల్‌మీ జీటీ 8 ప్రో
రియల్‌మీ  కొత్త ఫ్లాగ్‌షిప్ GT8 ప్రోను ఈ నెల ఇండియాలో విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా నడుస్తుంది, 16GB RAM & 1TB వరకు స్టోరేజ్ అప్షన్ ఉంది. 50MP (రికో సెన్సార్) + 50MP (అల్ట్రా-వైడ్) + 200MP (టెలిఫోటో) కెమెరా సెటప్‌ ఉంది. రియల్‌మీ UI (ఆండ్రాయిడ్ 16 ఆధారంగా)పై నడుస్తుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.65వేలు ఉంటుందని, నవంబర్ మొదటి వారంలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు.

ఒప్పో ఫైండ్ X9 ప్రో
ఒప్పో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫైండ్ X9 ప్రోను నవంబర్‌లో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ అప్షన్ ఉంది. కెమెరా విషయానికొస్తే 50MP + 50MP + 200MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ColorOS 16 (ఆండ్రాయిడ్ 16 ఆధారంగా)కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.1 లక్ష వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఒప్పో  ఫైండ్ సిరీస్‌లో ఇది అత్యంత లేటెస్ట్  ఫోన్ అవుతుంది. ఈ నవంబర్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు చాలా స్పెషల్ నెల కానుంది. OnePlus 15, iQOO 15 ఫ్లాగ్‌షిప్ విభాగంలో పోటీని పెంచుతుండగా, Nothing ఫోన్ (3a) Lite, Realme GT 8 Pro మిడ్ రేంజ్  బెస్ట్ అప్షన్ కావచ్చు. ఒప్పో ఫైండ్ X9 ప్రో ప్రీమియం విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ సెట్ చేయగలదు.