ప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే

ప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే

అనూప్ గఢ్: ప్రధాని మోదీ ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు అన్నింటినీ "నియంత్రిస్తున్నారని" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజలను "బానిసలు"గా మార్చడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. రాజస్థాన్‌‌లోని శ్రీ గంగానగర్ జిల్లా అనూప్‌‌గఢ్‌‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే  మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు,  వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పని చేస్తుందని చెప్పారు.

"బహుశా ప్రధాని కూడా ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. కానీ, మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో అక్కడ విమానాలు నడిపేందుకు అనుమతి లభించదు. అంటే అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. గాలి, భూమి, ఓడరేవులు, విమానాశ్రయాలు అన్నీ ఆయన కంట్రోల్​లోనే ఉన్నాయి..వీటన్నింటినీ ప్రధాని కంట్రోల్ చేస్తున్నారు” అని ఖర్గే విమర్శించారు. ‘‘మమ్మల్ని భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు.. కానీ మేం భయపడబోం.. పేదల కోసం పోరాడి వారి కష్టాలు తొలగిస్తాం” అని ఆయన అన్నారు. కాగా, రాజస్థాన్‌‌లోని మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.