అమ్మాయి కడుపులో 2 కిలోల  వెంట్రుకలు

అమ్మాయి కడుపులో 2 కిలోల  వెంట్రుకలు

లక్నో: ఉత్తరప్రదేశ్ కు చెందిన17 ఏండ్ల అమ్మాయి కడుపులో నుంచి డాక్టర్లు రెండు కిలోల వెంట్రుకలు బయటకు తీశారు. ట్రైకోబెజోవర్ అనే అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆ అమ్మాయి రెండేండ్లుగా తన జట్టు తానే పీక్కొని తింటోంది. రోజు రోజుకు బలహీనంగా మారడంతోపాటు కడుపునొప్పితో బాధపడుతుండటంతో పేరెంట్స్​ఆమెను దగ్గరలో ఉన్న బలరాంపూర్​హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ ఎస్ఆర్ సందార్ ఆమెకు సీటీ స్కాన్, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్​తదితర పరీక్షలు చేసి, అమ్మాయి కడుపులో వెంట్రుకలు పేరుకుపోయి బంతిలా మారినట్లు గుర్తించారు. దాదాపు గంటన్నరపాటు ఆపరేషన్​చేసి తీయగా రెండు కిలోల వెంట్రుకలు బయటపడ్డాయి. అవి ముద్దగా మారి చిన్నపేగు ద్వారాన్ని బ్లాక్​చేయడంతో జీర్ణవ్యవస్థ దెబ్బతిని ఆమె బలహీనంగా మారిందని ఈ క్రమంలోనే 32 కేజీల బరువు తగ్గిందని డాక్టర్లు తెలిపారు.