Good Health: షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి... ఏం తినకూడదో తెలుసా...

Good Health: షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి... ఏం తినకూడదో తెలుసా...

మధుమేహం.... షుగర్​ వచ్చిందా... నోటికి తాళం వేసేస్తారు..  ఎంత ఇష్టం ఉన్నా.. సరే లిమిట్​ ఫుడ్​కే పరిమితం అవ్వాలి.. కొన్ని కొన్ని పదార్దాలు అసలే తినకూడదని వైద్యులు చెబుతుంటారు. తిండి విషయంలో ఆంక్షలు అన్నీ.. ఇన్నీ కావు.  అసలు షుగర్​ ఎటాక్ అయితే ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసుకుందాం. . .

డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఇది రక్తంలో చక్కెరను అనూహ్యంగా పెంచే జీవక్రియ వ్యాధి. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నపుడు షుగర్ వ్యాధి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. షుగర్ వచ్చిందని తేలితే.. ఎక్కడ లేని ఆంక్షలు మొదలవుతాయి. ఏది తిన్నా.. షుగర్ పెరుగుతుందంటారు. పండు ముట్టనివ్వరు, భోజనం సరిగా చేయనివ్వరు. ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరం.

షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? 

షుగర్‌ ఉన్న వాళ్లు పళ్లు తినకూడదంటారు కానీ, చిన్నప్పటినుంచి పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తింటే షుగర్‌ సమస్య రాదు. షుగర్‌ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్థాలను బాగా తగ్గించి పొద్దున, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తియ్యగా వుండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి మంచిది.

ఆకు కూరల్లో ఏముంది?

తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పొన్నగంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలలో కూడా ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది.

షుగర్‌ ఉన్నవారు ఏం చేయాలి?

  • షుగర్ వున్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి
  • టైమ్ ప్రకారం భోజనం చేయాలి, అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి
  • టీ,  కాఫీ తగ్గించాలి, వాటి కంటే లెమన్ టీ, అల్లం టీ మంచిది.
  • నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు అసలే వద్దు
  •  వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి, లేదా ఆపేయాలి

షుగర్‌ పెరగకుండా ఏం చేయాలి?

  • తిన్నది ఏదైనా అరిగించుకునేలా.. అంటే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి
  • నడకతో పాటు వ్యాయామం మంచిది.
  • ఓపిక, శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే బెటర్
  • రాత్రి పూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్ర పోవడం తప్పనిసరి
  • ఒత్తిడికి దూరంగా ఉండండి.. కుటుంబంతో సరదాగా గడపండి

షుగర్‌ ఉన్నవాళ్లు తినకూడనివి

  • స్వీట్లు, ఐస్‌క్రీమ్స్‌, చక్కెర పదార్థాలు
  • అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటస్‌ పేషెంట్స్‌ తినకపోవడమే మంచిది
  • బొప్పాయి పండులో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. షుగర్‌ ఉన్నవాళ్లు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి
  • పండ్లతో పోలిస్తే జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది
  • ప్రాస్డ్​ ఫుడ్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు

ALSO READ :-తమిళనాడులో ఇండియా కూటమి సీట్లపై క్లారిటీ