మార్చ్ 30న ఫుడ్సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా : ఫుడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వినీల్ కుమార్

మార్చ్  30న  ఫుడ్సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా : ఫుడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వినీల్ కుమార్

జనగామ అర్బన్, వెలుగు :  రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్,  రిజిస్ట్రేషన్ మేళా ఈ నెల 30 న  ఉంటుందని  ఫుడ్​ఇన్స్​పెక్టర్​ సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. 

ఈ మేళా  కలెక్టరేట్​లో  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్,  రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం  7306335795, గెజిటెడ్​ ఫుడ్​ ఇన్స్​పెక్టర్​ 9985820544 నంబర్ల లో  సంప్రదించాలని పేర్కొన్నారు.