
న్యూఢిల్లీ: ఇండియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) గురించి చర్చించడానికి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ బ్రస్సెల్స్ (బెల్జియం) లో యూరోపియన్ కమిషనర్ (ట్రేడ్) మారోస్ సెఫ్కోవిక్‌ని కలిశారు. ఒక నెలలో ఇది వాళ్ల రెండో మీటింగ్. గోయల్ మే 23న వాషింగ్టన్ నుంచి బ్రస్సెల్స్‌కి వెళ్లారు.
ఇండియా ఎఫ్‌టీఏ చర్చలను నడుపుతున్న ఎల్. సత్య శ్రీనివాస్, ఆయన టీమ్ ఇప్పటికే ఈయూ హెడ్‌క్వార్టర్స్ చేరుకున్నారు. ఈ నెల ఆరంభంలో కూడా గోయల్, ఈయూ ప్రతినిధులతో మీటింగ్స్ జరిపారు. సెఫ్కోవిక్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “పీయూష్ గోయల్‌ని స్వాగతించడం సంతోషంగా ఉంది. మేం మంచి ప్రోగ్రెస్ సాధించాం. ఇదే ఊపును కొనసాగిద్దాం. త్వరలో జరిగే మన నెక్స్ట్ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నా” అని అన్నారు.
“ఇండియా, ఈయూ రెండూ కలిసి అభివృద్ధి చెందడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ స్పీడ్‌ని కంటిన్యూ చేద్దాం!” అని సెఫ్కోవిక్ పోస్ట్‌కు గోయల్ రిప్లై ఇచ్చారు. ఈ చర్చలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇండియా, 27 దేశాల ఈయూ జులై నాటికి ట్రేడ్ అగ్రిమెంట్‌ని క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.
ఈ ఇంటెరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్‌లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు), గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్, టారిఫ్స్, నాన్–-టారిఫ్ బ్యారియర్స్ వంటి అంశాలు ఉండొచ్చు. తాజాగా ఇరు పక్షాల అధికారులు మే 16న ఢిల్లీలో 11వ రౌండ్ చర్చలను ముగించారు.
గ్లోబల్ ట్రేడ్‌లో అనిశ్చితి ఉండటం వల్ల, ముఖ్యంగా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యాక్షన్స్ కారణంగా, ఈ అగ్రిమెంట్‌ను రెండు ఫేజ్‌లలో క్లోజ్ చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.