వింటర్ ముగిసే వరకు పెట్రో రేట్లు తగ్గుతయ్

వింటర్ ముగిసే వరకు పెట్రో రేట్లు తగ్గుతయ్

వారణాసి: చలికాలం ముగింపు వరకు పెట్రో ధరలు తగ్గబోవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరుగుతున్నాయ. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద మార్కును దాటగా.. మరికొన్ని స్టేట్స్‌‌లో సెంచరీకి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంపై స్పందించారు. ‘అంతర్జాతీయ మార్కెట్‌‌లో పెట్రోలియం ప్రైజ్ పెరగడం వినియోదారుల పైన భారం పడేలా చేస్తోంది. ఈ చలికాలం ముగిసే సమయంలో పెట్రో ధరలు కొంత మేర తగ్గుతాయి. ఇది ఇంటర్నేషనల్ విషయం. డిమాండ్ పెరగడం వల్లే ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సీజన్ ముగిసేలోపు ధరలు క్రమంగా తగ్గుతాయి’ అని ప్రధాన్ స్పష్టం చేశారు.