డిజిటల్ ఫ్లాట్​ఫాంలకు  మస్తు డిమాండ్

డిజిటల్ ఫ్లాట్​ఫాంలకు  మస్తు డిమాండ్


హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో ఏడాదిన్నర నుంచి క్లాసులు వినాలన్నా.. ఆఫీస్ మీటింగ్​లకు అటెండ్ కావాలన్నా.. యోగా చేయాలన్నా.. డ్యాన్స్ నేర్చుకోవాలన్నా.. డాక్టర్​తో మాట్లాడాలన్నా.. దూరాన ఉన్న బంధువులు, ఫ్రెండ్​కు వీడియో కాల్ చేయాలన్నా.. ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ డిజిటల్ ప్లాట్ ఫాం. కరోనా మొదలైనప్పటి నుంచి గ్రేటర్​లో ఆన్​లైన్ యూజర్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ని వాడే వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.  జూమ్, గూగుల్ మేట్, మైక్రోస్టాఫ్ టీమ్స్, స్కైప్ వంటి ప్లాట్​ఫామ్స్​కు  గతేడాది లాక్ డౌన్ నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది.  స్కూల్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్, వర్క్ అవుట్స్, ఫిట్​నెస్, బిజినెస్ మీటింగ్స్, యోగా, డ్యాన్స్ క్లాసులు, డాక్టర్ కన్సల్టేషన్ ఒకప్పుడు ఫిజికల్​గా ఉండేవి. కరోనా రాకతో అంతా డిజిటల్ మయమైంది.   జూమ్ యాప్, వెబ్ ఎక్స్ లింక్, గూగుల్ క్లాస్ రూమ్ ఇలా డిఫరెంట్ ప్లాట్ ఫామ్​లను విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు వాడుతున్నారు.  ఆన్​లైలో జూమ్ లింక్ క్రియేట్ చేసి, పాస్ వర్డ్ సెట్ చేసి స్టూడెంట్స్ కి పంపిస్తే లాగిన్ అయి క్లాసులు వింటున్నారు. ఇలా లైవ్ ఇంటరాక్షన్ల కోసం డిజిటల్ ఫ్లాట్​ఫాంల వాడకం  ఎక్కువైంది. కొన్ని సంస్థలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లు యాప్​లను, వెబ్ సైట్లను డెవలప్ చేసుకుంటున్నాయి. 

 ఫీచర్స్ ని బట్టి డెవలప్..

ఓ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కోడింగ్ తప్పనిసరి. ఆండ్రాయిడ్, ఐఓఎస్​లో ఆ అప్లికేషన్ పనిచేసేలా క్రియేట్ చేయాలి. ఇందుకోసం సెపరేట్​గా ఓ టీమ్ ఉంటుంది. చిన్న స్టార్టప్ కంపెనీ అయితే ఇద్దరు లేదా ముగ్గురు, పెద్ద కంపెనీ అయితే 10 మందికి పైగా  మెంబర్స్  ఉంటారు. ఏ యాప్​ను అయినా తయారు చేసే ముందు  ప్రైవసీ, సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడతామని డెవలపర్స్ చెప్తున్నారు. యాప్​లో ఉండే కంటెంట్ ను బట్టి కొన్నింటికి 20 నుంచి 25 రోజులు పడుతుందంటున్నారు. మరికొన్ని యాప్స్ ను డెవలప్ చేసేందుకు నెలల టైమ్ పట్టొచ్చని చెప్తున్నారు.  ప్రస్తుతం ప్రతి యాప్​లో  ఫీచర్స్ తో పాటు అందులో కెమెరా , మ్యాప్స్ ఉంటున్నాయి. ఇందుకోసం నేటివ్ డెవలప్ అనే కోడ్​ను యూజ్ చేస్తుంటారు.  

పర్మిషన్ల విషయంలో జాగ్రత్తగా..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్ స్టాల్ చేసుకోగానే అప్లికేషన్ యూజ్ చేయాలంటే కొన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వాలని కోరుతుంది.  చాలా వరకు యాప్స్​లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు. మైక్రో ఫోన్, ఫొటోస్, కాంటాక్ట్స్ వంటి వాటికి యాక్సెస్ అడుగుతుంది. తప్పనిసరిగా ఇవ్వాలా, లేదా అనేది చూసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటామని యాప్ డెవలర్స్ అంటున్నారు . జూమ్ వంటి చైనా యాప్స్ ద్వారా పర్సనల్ డేటా తెలుసుకునే చాన్స్ ఉంది. అందుకే వాటిని బ్యాన్ చేసి ఇండియన్ యాప్స్ యూజ్ చేయాలని డెవలపర్స్ అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఆఫీస్ మీటింగ్స్ కోసం వెబ్ ఇన్, వెబ్ ఎక్స్, స్కైప్ వంటి యాప్స్​ను వాడుతున్నాయి. అలాగే కొన్ని స్కూల్స్ మేనేజ్​మెంట్లు తమ స్కూల్ పేరుతో  ప్రత్యేకంగా యాప్స్​ను డెవలప్ చేయిస్తున్నాయి. లెర్నింగ్ హబ్స్ లేదా స్కూల్ పేరుతో  ఇలాంటి యాప్స్ ఉంటున్నాయి. ఈ యాప్స్ ద్వారానే స్కూల్, కాలేజీల మేనేజ్​మెంట్లు స్టూడెంట్స్​కు  ఆన్ లైన్ వీడియో క్లాసుల కండక్ట్ చేయడం, అసైన్​మెంట్లను ఇవ్వడం చేస్తున్నాయి. 

ఈజీగా ఇంట్రాక్ట్ అవ్వొచ్చు 

గూగుల్ మేట్, జూమ్, మైక్రో సాఫ్ట్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఎంతో యూజ్ ఫుల్​గా ఉన్నాయి. వీటి వల్ల వర్క్ ప్రొడక్టివిటీ, ఇంటరాక్షన్ సులువైంది. గతంలో నార్మల్ వీడియో కాల్​లో కమ్యూనికేట్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు చాలా యాప్​లు వస్తున్నాయి. మేము కూడా టెక్నికల్ టీం ద్వారా యాప్స్​లో కొన్ని ఎలిమెంట్స్​ను పెంచుతున్నాం. ఇప్పుడు వెబ్ సైట్స్ క్రియేట్ చేయడం కూడా సింపుల్ అయ్యింది.  కోడింగ్ వచ్చినా రాకపోయినా చాలా లెర్నింగ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తూ డెవలప్ చేయొచ్చు.
–విజ్ఞాన్, సీఈవో,  లైఫ్ ఆఫ్ గర్ల్ స్టార్టప్ కంపెనీ

 ఆన్ లైన్​లో యోగా క్లాస్
లాక్​డౌన్ నుంచి అంతా వర్చువల్ గా మారింది. మా దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు ఆన్​ లైన్​లోనే క్లాసులను కండక్ట్ చేస్తున్నాం. జూమ్ యాప్ ద్వారా లింక్ క్రియేట్ చేసి ఐడీ, పాస్ వర్డ్​ను వాట్సాప్ గ్రూప్​లో షేర్ చేస్తాం. దాని ద్వారా లైవ్ క్లాసెస్​లోకి అందరూ జాయిన్ అవుతారు. కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా డిజిటల్ ప్లాట్​ఫాం బెటర్​ ఆప్షన్​గా ఉంది.  – దుర్గేష్ , యోగా ట్రైనర్