
తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం కూడా థియేటర్, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
అనుష్క శెట్టి(AnushkaShetty), నవీన్ పొలిశెట్టి(NaveenPolishety) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty).ఈ మూవీలో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించనున్నారు.సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. నచ్చిన అబ్బాయితో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్న అనుష్కకి..నవీన్ పరిచయం అవుతాడు.కానీ నవీన్ కి చక్కగా మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది.ఇక వీరిద్దరీ పరస్పర నిర్ణయాలతో..హీరో తన ప్రేమతో అనుష్కని మారుస్తాడా..లేదా అనేది సినిమా అని తెలుస్తుంది.ఈ మూవీతో నవీన్ ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
పఠాన్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)..ఇప్పుడు జవాన్ గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ(Atli) రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించగా, దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్,సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది.
అలాగే తమిళంలో హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్న మూవీ నూడిల్స్. ఈ మూవీ 8 సెప్టెంబర్ 2023 థియేటర్ లలో రిలీజ్ కానుంది.
బాహుబలి కట్టప్పగా ఫేమస్ అయినా యాక్టర్ సత్య రాజ్ మెయిన్ క్యారెక్టర్ లో వచ్చిన మూవీ అంగరాగన్. ఈ మూవీ మిస్టరీ,హారర్ జోనర్ లో రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 8న థియేటర్లో రిలీజ్ కానుంది.
ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో:
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్(Jailer). ఆగస్టు 10న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో సత్తా చాటింది.ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లు వరకూ గ్రాస్, రూ.290 కోట్లు షేర్ రాబట్టింది. జైలర్ రూ. 160 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుంది.
జైలర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సెప్టెంబర్ 7వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. అలాగే
వన్ షాట్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లక్కీ గౌ (హిందీ) సెప్టెంబరు 6వ తేదీ..
సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్(హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో
స్కాట్స్ హానర్ (హాలీవుడ్) 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
షేన్ గిల్లీస్ (హాలీవుడ్) సెప్టెంబరు 5వ తేదీ..
ఇన్ఫమీ (హాలీవుడ్) సెప్టెంబర్ 6వ తేదీ..
టాప్ బాయ్ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 7వ తేదీ..
కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్3) సెప్టెంబరు 7వ తేదీ..
వర్జిన్ రివర్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 7వ తేదీ..
వాట్ ఇఫ్ (హాలీవుడ్) సెప్టెంబర్ 7వ తేదీ..
సెల్లింగ్ ది ఓసీ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ఐ యామ్ గ్రూట్ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా లో ..
లవ్ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా వాణి భోజన్‌తో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ భరత్‌కి ఇది 50వ సినిమా.
లయన్స్ గేట్ ప్లే,
ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో..
లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హైరిచ్..సెప్టెంబరు 4న
ఉరు (మలయాళం) సెప్టెంబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ టీవీ ప్లస్..
ది ఛేంజ్‌లింగ్ (హాలీవుడ్) సెప్టెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.