
నిజానికి బిగ్ బాస్ అనేది ఒక క్రేజీ షో. పరిచయం లేని కొంతమందిని ఒక ఇంట్లో ఉంచి. టైం, మొబైల్ తో సంబంధం లేకుండా, వారికి చిన్న చిన్న టాస్కులు పెడుతూ, మధ్యలో గొడవలు పెడుతూ..దాదాపు 100 రోజులపాటు సాగే ఆటనే ఈ బిగ్ బాస్. మరి ఈ సీజన్ 8 ఎలా ఆసక్తిగా మారనుందో చూడాలి.
ఇదిలా ఉంటే..బిగ్ బాస్ 8కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనేది బాస్ ఫ్యాన్స్లో చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో పలువురి పేర్లు గత నెల రోజులుగా బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం..ఇవాళ శనివారం (ఆగస్ట్ 31న) బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌లో 14 మంది వీళ్ళే అని టాక్ వినిపిస్తోంది. మరి ఆ 14 మంది ఎవరనేది చూసుకుంటే..
Also Read :- బిగ్ బాస్ 8 అప్డేట్
14 మంది కంటెస్టెంట్స్‌లో వీళ్ళే!
ఆదిత్య ఓం
అభయ్ నవీన్
యాంకర్ విష్ణుప్రియ
యష్మీ గౌడ
ప్రేరణ కంబం
నిఖిల్ మలియక్కల్
ఆర్జే శేఖర్ బాషా
నైనిక అనరుసు
బెజవాడ బేబక్క
నాగ మణికంఠ
కిర్రాక్ సీత
పరమేశ్వర్ హివ్రాలే
ఖయ్యూమ్ అలీ
సోనియా ఆకుల ఉన్నారు.
ప్రస్తుతం వినిపిస్తోన్న ఈ 14 మందితో పాటు..
మోడల్ రవితేజ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్
దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్‌లో ఒకరు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఫస్ట్ డే ఎంట్రీ ఇవ్వనున్నారు.
మిగతా వాళ్లలో మరో ఇద్దరినీ రేపు ఆదివారం (సెప్టెంబర్ 1)న పంపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంటే, వీరి హౌజ్ ఎంట్రీ సెప్టెంబర్ 2న సోమవారం రోజు టెలికాస్ట్ కానుంది. అనంతరం..ఇక మిగతా కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
Prepare for fiery nominations??
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 29, 2024
Just 3 Days To Go!#BiggBossTelugu8 pic.twitter.com/RYZcuOCcxK
బిగ్ బాస్ సీజన్ 8 టెలీకాస్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే.."బిగ్‌బాస్ 8 తెలుగు షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. శనివారం,ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ కానుంది. ‘ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిటే లేదు’ అని యాజమాన్యం వెల్లడించిన విషయం తెలిసిందే.