Pawan Kalyan : 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఫ్యాన్స్‌కు 'ఫుల్ మీల్స్'.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పోస్టర్ !

Pawan Kalyan : 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఫ్యాన్స్‌కు 'ఫుల్ మీల్స్'.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న  పోస్టర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ డ్రామా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.  ఈ మూవీపై  ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.  లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ  పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.

అభిమానులకు 'ఫుల్ మీల్స్'..
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  చివరి షెడ్యూల్  చిత్రీకరణ సెప్టెంబర్ 6, 2025న తిరిగి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తవుతుందని సినీ వర్గాల నుంచి సమాచారం.  దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి పవర్ స్టార్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించబోతున్నారు. "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రంలో పవన్ కళ్యాణ్ మాస్ అవతారం మరోసారి అలరించడం ఖాయం అంటున్నారు మూవీ మేకర్స్.  మైత్రీ మూవీ మేకర్స్  సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను షేర్ చేసింది. మరోవైపు ఈరోజు ( సెప్టెంబర్ 1న   "ఫుల్ మీల్స్  @ 4.45 PM. #UstaadBhagatSingh – స్టే ట్యూన్డ్!" అని క్యాప్షన్ ఇచ్చారు.

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్ గా.. 
దర్శకుడు హరీష్ శంకర్ బర్త్ డే సంధర్బంగా ఈ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.  తాను ప్రేమించే వ్యక్తిని మనమందరం ప్రేమించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అని మూవీ మేకర్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.  అయితే ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన లీకులపై మేకర్స్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలను షేర్ చేస్తున్న ఖాతాలను రిపోర్ట్ చేసి, తొలగిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, సినిమాను అత్యుత్తమంగా అందించడానికి సహకరించాలని మైత్రి మూవీ మేకర్స్ కోరారు. 

ఇద్దరు హీరోయిన్స్ తో పవన్ కల్యాణ్.. 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. అంతేకాకుండా, రాశీ ఖన్నా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఇటీవల ఆమె పోస్టర్‌ను విడుదల చేస్తూ తన పాత్ర పేరు 'శ్లోక' అని వెల్లడించారు. పోస్టర్‌లో కెమెరా పట్టుకుని ఆమె చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ అయనాంక బోస్ చేతుల్లో ఉంది. ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కులకర్ణి చూసుకుంటున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామ్-లక్ష్మణ్ ద్వయం అందిస్తున్నారు. ఇక, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఆనంద్ సాయి, స్క్రీన్‌ప్లే రైటర్‌గా కె. దశరథ్ పనిచేస్తుండగా, సి. చంద్ర మోహన్ అదనపు రచనలు అందిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రంపై అభిమానులతో పాటు మేకర్స్ కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.