ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది..శ్రీశైలం కృష్ణానదిలో యువకుడు గల్లంతు..చివరికి

ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది..శ్రీశైలం కృష్ణానదిలో యువకుడు గల్లంతు..చివరికి

విహారయాత్రలో ఊహించని ఘటన..ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది..కృష్ణా నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. ఈ ఊహించని పరిణామం అక్కడున్న వారందరినీ భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. 

తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు స్నేహితులు శనివారం(ఆగస్టు2) పాతాళ గంగ ప్రాంతాన్ని సందర్శించేందుకు శ్రీశైలానికి వచ్చారు. స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగారు. అయితే అనూహ్యంగా అందులో ఓ యువకుడు ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయాడు. మిగిలిన స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. 

Also Read : శ్రీశైలం - హైద్రాబాద్ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

అయితే సమీపంలో ఉన్న స్థానిక మత్స్యకారులు గమనించి వెంటనే తమ పడవలో యువకుడి దగ్గరకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోతున్న అతన్ని సాహసించి పట్టుకొని పడవలోకి లాగి ప్రాణాలు కాపాడారు. ఆ యువకుడిని అనంతరం ఒడ్డు వద్దకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించారు.

పర్యాటకుల కళ్లముందే జరిగిన ఈ ఘటన కొద్ది నిమిషాలు ఉద్రిక్తతను రేకెత్తించింది. మత్స్యకారుల చేసిన సాహసాన్ని పలువురు అభినందించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.