పంటలను దెబ్బ తీస్తున్న ఫంగల్​ ఇన్ఫెక్షన్.. ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు

పంటలను దెబ్బ తీస్తున్న ఫంగల్​ ఇన్ఫెక్షన్..  ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు

ప్రకృతిలో నిత్యం వస్తున్న మార్పులు పర్యావరణ సమతూల్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.  తద్వారా పంట  నష్టాలు ఏటా పెరిగిపోతోంది. కాగా ఇటీవల ఓ ఫంగల్​ ఇన్ఫెక్షన్​ పంటలను దెబ్బతీస్తోంది.  దీంతో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 10 ‌‌‌‌‌‌‌‌– 23 శాతం పంటల నష్టం..

ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 – 23 శాతం పంటలు ఫంగల్​ ఇన్ఫెక్షన్​లు ఎదుర్కొంటాయని 10 – 20 శాతం పంటలను రైతులు నష్టపోతారని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.  విభిన్న జీవుల సమూహం అయిన శిలీంధ్రాలు బీజాంశాల ద్వారా ఇవి పునరుత్పత్తి చేస్తాయి.  వాతావరణ మార్పులు పంటల ఉత్పత్తికి సవాలుగా మారుతున్న ఈ తరుణంలో ఫంగల్​ ఇన్ఫెక్షన్లు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి.  ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ,  శిలీంధ్రాలు దానిని తట్టుకునే సామర్థ్యాన్ని పొందుతాయి. తద్వారా పంట నష్టం మరింత జరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ప్రభావం వీటి పైనే...

వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్స్​, బంగాళదుంపలోని అయిదు ముఖ్యమైన కేలరీలను ఈ ఫంగస్​ ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చు. 

వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తప్పనిసరి..

పంటల ఉత్పాదకత పెంపొందించే క్రమంలో వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఈ ఫంగస్​ ని తట్టుకునే వంగడాలు సృష్టించడం ద్వారా ఆహార సంక్షోభం నుంచి కొంతైన గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు, దాతృత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు సహకరించాలని కోరుతున్నారు.