యాంకర్ అడిగింది.. చొక్కా ఇచ్చేశాడు.

యాంకర్ అడిగింది.. చొక్కా ఇచ్చేశాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shourya) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali). పవన్ బసంశెట్టి(Pawan basamsetti) అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ శౌర్య ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిత్ర దర్శకుడు పవన్ బసంశెట్టి, నటుడు షైన్ టామ్ చాకో(Shine tom chacko). సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

ALSO READ:పవర్​ఫుల్​ పోలీస్ రోల్​లో నితిన్ 

అయితే ఈ ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలో యాంకర్ షైన్ టామ్ చాకోను మీ షర్ట్ బాగుంది నాకు ఇస్తారా అని అడిగింది. దీంతో వెంటనే.. షైన్ టామ్ చాకో షర్ట్ విప్పి ఇవ్వబోయాడు. పక్కనే ఉన్న డైరెక్టర్ ఆపడానికి ప్రయతించాడు. అయినా కూడా షైన్ తన షర్ట్ యాంకర్ కు ఇవ్వబోయాడు. అయితే షర్ట్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తే బాగోదు కదా ఐపోయాక ఇస్తాను అన్నాడు షైన్ . అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. షర్ట్ తీసుకోవడమే కాదు దాన్ని ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పాడు. దానికి యాంకర్.. ఖచ్చితంగా వేసుకుంటానని, వేసుకొని సోషల్ మీడియా లో కూడా అప్లోడ్ చేస్తానని చెప్పింది. అయితే తప్పకుండా తన షర్ట్ ఇస్తానని చెప్పాడు షైన్ టామ్ చాకో. 

బలే ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.