
టాలీవుడ్ హీరోలందరూ పోలీస్ పాత్రల్లో నటించడానికి ఎప్పుడు ముందుంటారు. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ(Vakkantham Vamsi) తెరకెక్కిస్తున్న మూవీలో నితిన్(Nithin) కూడా పవర్ఫుల్ పోలీస్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఇందులో భాగంగా నితిన్.. డాక్టర్, ఇంజనీర్, లాయర్, వంటి పాత్రల్లో కనిపిస్తూ థ్రిల్ చేస్తాడని టాక్. ఈ క్రమంలో నితిన్ చేసే పోలీస్ పాత్ర సినిమాకు కీలకం కానుందట. ఆ పాత్ర, ఆ పాత్ర తరువాత వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది.
ALSO READ:సిగరెట్ తాగాడని.. స్టార్ హీరోపై కేసు
ఇక ఈ మూవీ కోసం నితిన్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ కు జోడీగా టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సెషన్ శ్రీలీల(Sreeleela) నటిస్తుంది. ఈ సినిమాకు ఎగస్ట్రా, జూనియర్, షైతాన్, ఆర్డినరీమెన్ లాంటి టైటిల్స్ పరిశిలీనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో హిట్ కొట్టాలని హీరో నితిన్, డైరెక్టర్ వంశీ చాలా పట్టుదలతో ఉన్నట్టు వినిపిస్తోంది.సెన్సెషన్ మ్యూజిక్ డైరెక్టర్ హరీస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి త్వరలో ఆఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు సమాచారం. మరి నితిన్, వక్కంతం వంశీ కాంబో లో వస్తున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.