పిల్లలకు బోర్ కొట్టకుండా.. ఫన్నీ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్

పిల్లలకు బోర్ కొట్టకుండా.. ఫన్నీ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్

ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా!  బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ టైమ్‌లో పిల్లలకు బోర్ కొట్టకుండా కొన్ని సరదా ఎక్స్ పరిమెంట్స్ చేయించవచ్చు. 
బోలెడన్ని ఫన్నీ సైన్స్ ఎక్సపెరిమెంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ట్రై చేయండి.
బాటిల్ రాకెట్

పిల్లలు బాగా ఎంజాయ్ చేసే ఎక్స్పరిమెంట్ ‘బాటిల్ రాకెట్’. దీనికి రెండు లీటర్ల ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, వెనిగర్, కలర్ పెన్సిల్స్, వైన్ కార్క్, పేపర్ టవల్, బేకింగ్ సోడా, టేప్, ఒక ప్యాడ్ లేదా అట్టముక్క ఉంటే చాలు.
ఇలా చేయాలి
ఈ ప్రయోగాన్ని గార్డెన్లో లేదా ఏదైనా ఓపెన్ ప్లేస్లో చేయాలి. ప్రయోగంలో ఫాలో అయ్యే రూల్స్ను బట్టి బాటిల్ కనీసం ముప్పై మీటర్ల ఎత్తు ఎగురుతుంది. కావాలనుకుంటే బాటిల్ను రాకెట్లా డెకొరేట్ చేయొచ్చు. అట్టముక్కతో లాంచ్ప్యాడ్ ఏర్పాటు చేయాలి. అంటే బాటిల్ తలకిందులుగా ఉండేందుకు ఒక ఆధారంలా ఉండాలి. బాటిల్లో రెండు కప్పుల వరకు వెనిగర్ పోయాలి. చిన్న ముక్కలా కట్ చేసుకున్న పేపర్ టవల్లో ఒక చెంచా బేకింగ్సోడా వేసి, బాటిల్ మూతి ద్వారా లోపల పెట్టాలి. వెంటనే వైన్ కార్క్ (మూతలాంటిది) బిగించి, బాటిల్ను తలకిందులుగా ఉంచాలి. బాటిల్ మూతి నేలను తాకకూడదు. దీనికోసం టేప్లతో పెన్సిల్స్ను నాలుగు వైపులా ఒక స్టాండ్లాగా చేయాలి. ఆ స్టాండ్ మధ్యలో బాటిల్ను తలకిందులుగా ఉంచాలి. ఇలా చేసిన అర నిమిషంలోపల వెనిగర్, బేకింగ్ సోడా రియాక్షన్ వల్ల బాటిల్ వేగంగా పైకి ఎగురుతుంది. రాకెట్లా దూసుకెళ్తుంది. అయితే, అప్పుడు గాలి లేదా బాటిల్ ఉన్న దిక్కునుబట్టి, అది వెళ్లే దిశ మారుతుంది. బాటిల్ ఎగరడం పిల్లలకు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

వాకింగ్ వాటర్

ఇది ఫన్ ఎక్స్ పెరిమెంట్. దీనికి ఏడు డిస్పోజబుల్ వాటర్ గ్లాసులు, రెడ్, ఎల్లో, బ్లూ  ఫుడ్ కలర్స్, పేపర్ టవల్, నీళ్లు కావాలి. 

ఇలా చేయాలి

ఏడు గ్లాసులను వరుసగా పెట్టాలి. మొదటి, మూడవ, ఐదవ, ఏడవ గ్లాసుల్లో 30 శాతం వరకు నీళ్లు పోయాలి. మొదటి గ్లాసులో ఏడవ గ్లాసులో బ్లూ కలర్ యాడ్ చేయాలి. ఇప్పుడు పేపర్ టవల్ తీసుకుని పొడవుగా కట్ చేయాలి. ఈ పేపర్ ను అన్ని గ్లాసులపై నుంచి నీళ్లు లోపలికి మునిగేలా చేయాలి. పేపర్ ఒక గ్లాస్ నుంచి మరో గ్లాస్ లోకి వెళ్తూ... చివరి గ్లాస్ దాకా చేరుకోవాలి. అంటే అన్ని గ్లాసుల్లోనూ పేపర్ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత నీళ్లలో మునిగిన పేపర్ టవల్స్ ఆ కలర్ వాటర్ ను పీల్చుకుంటాయి. అలా ఒక గ్లాస్ లోని కలర్ వాటర్ మరో గ్లాస్ లోనికి చేరుతుంది. అలా అన్ని గ్లాసుల్లోనూ వాటర్ చేరుతుంది. ఖాళీగా ఉన్న గ్లాసుల్లోనూ వాటర్ చేరుతుంది. ఇలా నీళ్లు ఒక గ్లాస్ నుంచి మరో గ్లాస్ లోకి చేరుకుంటుంటే.. వాటర్ వాకింగ్ లా అనిపిస్తుంది.