Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌కు భారీ ఊరట.. మూడేళ్ల బ్యాన్ ఎత్తేసిన ఫెడరేషన్! అసలేం జరిగింది?

Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌కు భారీ ఊరట.. మూడేళ్ల బ్యాన్ ఎత్తేసిన ఫెడరేషన్! అసలేం జరిగింది?

బాలీవుడ్ హీరో రణ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వెస్ట్రన్‌‌‌‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌‌‌‌ బుధవారం ప్రకటించింది. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సీఐఎన్‌‌‌‌టీఏఏ), ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీఏఏ) చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ అధ్యక్షుడు బీఎన్‌‌‌‌ తివారీ తెలియజేశారు.

‘డాన్‌‌‌‌ 3’ చిత్రం షూటింగ్‌‌‌‌కు ముందు రణవీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ తప్పుకోవడంతో తమకు నష్టం వాటిల్లిందని, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఫర్హాన్‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ను సంప్రదించారు. దీంతో రణవీర్‌‌‌‌‌‌‌‌పై ఫెడరేషన్‌‌‌‌ మూడేళ్లు బ్యాన్‌‌‌‌ విధించింది.

అయితే తనపై తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ మంగళవారం ఫెడరేషన్‌‌‌‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తమకు ఈ నోటీసులు అందాయని, వివాదాన్ని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాము  రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌కు సూచించినట్టు  ఫెడరేషన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ అశోక్ పండిట్ తెలియజేశారు.