సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 300 రైళ్లు రద్దు..కారణం ఇదే

సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 300 రైళ్లు రద్దు..కారణం ఇదే

సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు వందల సంఖ్యలో రైళ్లు రద్దు కానున్నాయి. దాదాపు 200 రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరో 100 రైళ్ల రాకపోకలు ఆలస్యం కానున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశమే. 

సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమ్మిట్ లో  ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా  అనేక మార్గాలను నిషేధించింది. ఢిల్లీలో దుకాణాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మూసివేయబడతాయి. తాజాగా రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు నార్తర్న్ రైల్వే కేంద్రం వెల్లడించింది. 

రద్దు చేయబడిన రైళ్ల వివరాలివే..

నార్తర్న్ రైల్వే పరిధిలో  రద్దు చేయబడిన రైళ్ల వివరాలను ఉత్తర రైల్వే తన ట్విట్టర్ లో వెల్లడించింది.  200 రైళ్లను రద్దు చేస్తున్నట్లు..మరో 100 రైళ్ల రాకపోకలపై జీ20 సమ్మిట్ ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 8, 9, 10 మధ్య రైలులో ఢిల్లీ లేదా ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఈ రైళ్ల జాబితాను చెక్ చేసుకోవాలని కోరింది. ఈ తేదీలలో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించింది.