
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పీకర్పదవి కోసం ఎంపిక చేసింది. సోమవారం ఆయన ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నెల 14న (గురువారం) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశమైన తర్వాత స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆయన అధ్యక్షతన సభను నిర్వహిస్తారు. 15న ఉదయం అసెంబ్లీ, కౌన్సిల్‌ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీ, కౌన్సిల్‌లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి, చర్చిస్తారు. ఆ తర్వాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తుత సెషన్‌లో ఉండకపోవచ్చని చెప్తున్నారు.