మంత్రి వివేక్ వెంకటస్వామితోనే మంచిర్యాల జిల్లా అభివృద్ధి : పార్వతి విజయ

మంత్రి వివేక్ వెంకటస్వామితోనే మంచిర్యాల జిల్లా అభివృద్ధి : పార్వతి విజయ

కోల్​బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పూర్తిచేయని పనులను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గడ్డం వివేక్​ వెంకటస్వామి చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్, క్యాతనపల్లి మున్సిపల్​ మాజీ కౌన్సిలర్​ పార్వతి విజయ అన్నారు. వివేక్​ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి పదవి వచ్చినందుకు శనివారం రామకృష్ణాపూర్​లోని విజయ గణపతి ఆలయంలో వివేక్​ యువసేనా ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి 30 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

పార్వతి విజయ మాట్లాడుతూ.. మంత్రి వివేక్​వెంకటస్వామితోనే మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. బీఆర్ఎస్​హయాంలో పూర్తికాని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ ​బ్రిడ్జి పనులు పూర్తి చేయించారని గుర్తుచేశారు. భూనిర్వాసితులకు పూర్తి పరిహారం అందించారని, రామకృష్ణాపూర్ ​వైపు ఫ్లైఓవర్ అప్రోచ్​ రోడ్ వెడల్పునకు రూ.1.5కోట్లు మంజూరు చేశారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డు ఉద్యోగి, యోగా మాస్టర్​ కొమురయ్యను సన్మానించారు. కాంగ్రెస్​ లీడర్​ ఎల్పుల సత్యనారాయణ, స్థానికులు పాల్గొన్నారు.