రిజర్వేషన్​ బిల్లు మహిళలకు వరం : వివేక్ వెంకటస్వామి

రిజర్వేషన్​ బిల్లు మహిళలకు వరం : వివేక్ వెంకటస్వామి
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

బెల్లంపల్లి,వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి చరిత్ర సృష్టించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం సాయంత్రం బెల్లంపల్లిలో ఆయన పర్యటించి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 33 శాతం మహిళా బిల్లుతో దేశంలో 180 పార్లమెంట్ స్థానాలు, రాష్ట్రంలో 39 అసెంబ్లీ స్థానాలు మహిళలకే దక్కనున్నాయని తెలిపారు. ఎవ్వరూ చేయని విధంగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని, మహిళలకు ఈ బిల్లు గొప్ప వరమన్నారు.

వ్యాపారవేత్త కొడిప్యాక శ్రీనివాస్  ఇంటికి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కొడుకు సాయినాథ్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ బస్తీ, టేకుల బస్తీ, ఏఎంసీ ఏరియాల్లో గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వినాయకుడి మండపాలకు వెళ్లిన వివేక్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, బెల్లంపల్లి  

టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, మహిళా ప్రెసిడెంట్​కల్యాణి, జిల్లా ఉపాధ్యక్షుడు హరీశ్ గౌడ్, అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయులు, పట్టి వెంకట కృష్ణ, బైస మల్లేశ్, కొంక సత్యనారయణ, శైలేందర్ సింగ్, రాజనర్సు, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.