
- ఎమ్మెల్యే రామారావు పటేల్కులేఖ రాసిన కేంద్రమంత్రి గడ్కరీ
భైంసా, వెలుగు: నిర్మల్‌జిల్లా బాసర నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ మహోర్ క్షేత్రానికి( హిమాయత్ నగర్ ) రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని ఎమ్మెల్యే రామారావు పటేల్తెలిపారు. దీని పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లేఖ ద్వారా ఎమ్మెల్యే కు సమాచారం అందించగా.. మంగళవారం భైంసాలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు.
గత మే 5న రెండు పుణ్యక్షేత్రాల మధ్య భైంసా, కుభీర్మీదుగా నేషనల్ హైవే నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పటేల్ కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా ముధోల్ లో ఈజీఎస్కింద రోడ్ల నిర్మాణానికి రూ.7.97 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. లీడర్లు పండిత్రావు పటేల్, సౌంవ్లీ రమేశ్, సాయినాథ్తదితరులు ఉన్నారు.