ISRO Success: గగన్యాన్ రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ విజయవంతం

ISRO Success: గగన్యాన్ రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ విజయవంతం

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్ యాన్ మిషన్ ప్రయోగ అభివృద్ధిలో ఇస్రో మరో ముందడుగు వేసింది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వాహన నౌక క్రయోజెనిక్ ఇంజిన్ ను బుధవారం (ఫిబ్రవరి 21) విజయవంతంగా ప్రయోగించింది. ఇది లాంచ్ వెహికల్ మార్క్ II(LVM3) క్రయోజెనిక్ దశను అంతరిక్షంలోకి పంపుతుంది. గగన్ యాన్ మిషన్  తొలి విమానంలో భారతీయ వ్యోమగాములను పంపేందుకు హెవీ లిఫ్ట్ వాహనాన్ని ఎంపికచేయబడింది. 

వ్యాక్యూమ్ ఇగ్నిషన్ పరీక్షలో ఇది ఏడవది. మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిటీలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక్క ఇంజనీర్లు ఇంజిన్ పనిచేస్తున్న విధాన్నాన్ని పరిశీలించారు. తాజా పరీక్షతో గగన్ యాన్ మిషన్ CE20 ఇంజిన్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ పరీక్షలు పూర్తయ్యాయని.. టెస్టింగ్ లో భాగంగా 8810 సెకన్ల నిర్ధిష్ట వ్యవధిలో వివిధ అపరేటింగ్ పరిస్థితులలో 39 హాట్ ఫైరింగ్ పరీక్షలను నిర్వహించామని ఇస్రో తెలిపింది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2023లో టెస్ట్ వెహికల్ (TV-D1) సింగిల్ స్టేజ్ లిక్వ్ డ్ రాకెట్ ను పరీక్షించింది. TV-D1 టెస్ట్ ఫ్లైట్ గగయాన్ మిషన్ లో కీలకమైన భాగం. ఇది ముగ్గురు వ్యక్తుల సిబ్బందిని మూడు రోజులమిషన్ కోసం 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపడం, ఆ తర్వాత ల్యాండింగ్ సురక్షితంగా తిరిగి వచ్చేలా చేయడం ద్వారా మానవ అంతరిక్ష ప్రయాణానికి భారత దేశం సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

గగన్ యాన్ మిషన్ లో భాగంగా 2024 మూడో త్రైమాసికంలో సిబ్బంది లేని వ్యోమిత్ర మిషన్ ప్రయోగానికి షెడ్యూల్ ఉన్నట్లు ఇస్రో తెలిపింది. అయితే భారతీయ వ్యోమగాములను తీసుకెళ్లే మానవ సహిత మిషన్ గగన్ యాన్ మిషన్ ప్రయోగాన్ని 2025లో నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.