అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండు

అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండు

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లు నీట మునగడంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి హద్దులు దాటినందునే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పారు. తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు అంటూ కేసీఆర్ అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండని మండిపడ్డారు. సరైన అనుమతులు తీసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని షెకావత్ విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను సాంకేతికంగా సరైన పద్దతిలో అమర్చలేదని గజేంద్ర సింగ్ షెకావత్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల కరప్షన్ జరిగిందన్న ఆయన.. పంపుల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారముందని చెప్పారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని, అందుకే వాటిని అమర్చడంలో సరైన పద్దతి పాటించలేదని షెకావత్ విమర్శించారు.