గజ్వేల్​లో టెన్షన్​ టెన్షన్​ ...హిందూ సంఘాల ర్యాలీ, రాస్తారోకో

గజ్వేల్​లో టెన్షన్​ టెన్షన్​ ...హిందూ సంఘాల ర్యాలీ, రాస్తారోకో

సిద్దిపేట, వెలుగు : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ఆకతాయి పనికి గజ్వేల్ లో టెన్షన్ ​నెలకొంది. సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో పిడిచేడ్ రోడ్డులోని శివాజీ విగ్రహం దగ్గర మూత్ర విసర్జన చేశాడు. దీంతో  స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో సదరు యువకుడితో ఉన్న మరో ఇద్దరు గొడవ పడడంతో ఓ స్థానికుడు గాయపడ్డాడు. దీంతో స్థానికులు రాస్తారోకో  చేయడంతో అర్ధరాత్రి వేళ సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మంగళవారం పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొందరు ఒక ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

ఆందోళనకారులు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రాస్తారోకో చేయగా సీపీ శ్వేత నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  సీపీ మాట్లాడుతూ గజ్వేల్​లో జరిగిన  వివిధ ఘటనలకు సంబంధించి మొత్తం ఐదు కేసులు నమోదు చేశామని, ఎనిమిది మందిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్టు చెప్పారు. చెప్పారు. రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేశ్​నాయుడుతో పాటు సీపీ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.