రైతును అవహేళన చేసిన.. గజ్వేల్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ సస్పెండ్ 

రైతును అవహేళన చేసిన.. గజ్వేల్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ సస్పెండ్ 

ములుగు/ గజ్వేల్​, వెలుగు: రైతును అవహేళన చేస్తూ మాట్లాడిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ చిట్టంపల్లి స్వామిపై వేటు పడింది. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అయిన వీడియో ఆధారంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ హైమావతి అతడిని సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గజ్వేల్‌‌‌‌‌‌‌‌ మండలం మక్త మాసాన్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన రైతు యేసు రీజినల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్నాడు.

జీవనాధారమైన భూమి పోతే తమ బతుకు ఆగమవుతుందని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ను కోరాడు. పరిహారం కోసం ఇటీవల మరోసారి కలవగా ‘నువ్వు బతికే ఉన్నావా? పురుగు మందు తాగలేదా?’ అంటూ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ వెటకారంగా మాట్లాడిన వీడియో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. బాధలో ఉన్న రైతు పట్ల తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ అనుచితంగా వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకున్నారు.