మెగా ఫ్యాన్స్ కి షాక్.. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా కాదా?

మెగా ఫ్యాన్స్ కి షాక్.. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా కాదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "గేమ్ చేంజర్". తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కాయడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు  నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి చిన్న న్యూస్ బయటకు వచ్చినా క్షణాళ్ళో వైరల్ గా మారుతోంది.

 తాజాగా ఈ మూవీ నుండి వినిపిస్తున్న న్యూస్ కి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటంటే.. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదట. తమిళ భాషలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. కేవలం క్లోజప్ లో ఉండే షాట్స్ మాత్రమే తెలుగులో ఘాట్ చేస్తున్నారని సమాచారం. తెలుగు హీరో, తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు యాక్టర్స్ చేస్తున్న ఈ సినిమాని తమిళంలో ఎలా ఘాట్ చేస్తారని, కేవలం తమిళ డైరెక్టర్ తెరకెక్కించినంత మాత్రాన తమిళ సినిమా అవుతుందా అని మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై మూవీ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక రామ్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో.. అంజలి, శ్రీకాంత్,సునీల్,నవీన్ చంద్ర,వెన్నెల కిషోర్,ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.