Game Changer Leaked Video: గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి వీడియో లీక్.. హెలికాఫ్టర్ ఎంట్రీ అదుర్స్

Game Changer Leaked Video: గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి వీడియో లీక్.. హెలికాఫ్టర్ ఎంట్రీ అదుర్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు. కనీసం చిన్న చిన్న అప్డేట్స్ అయినా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. దీంతో మెగా చాలా డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కనీసం 2024లో అయినా వస్తుంది అనుకుంటే అది కూడా కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే గేమ్ ఛేంజర్ మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా లీక్డ్ పిక్స్ తో సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఇటీవలే రామ్ చరణ్ పంచ కట్టుకొని ఉన్న లుక్, పొలిటికల్ మీటింగ్ కు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ లుక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు తాజాగా మరోసారి గేమ్ ఛేంజర్ లొకేషన్ నుండి వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. ఆ వీడియోలో ఒక మార్కెట్ లో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న సీన్ ను షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా లేట్ అయినా పరవాలేదు నెక్స్ట్ లెవల్లో ఉండాలి శంకర్ సార్. ఆ హెలికాఫ్టర్ లో రాయల్ రామ్ చరణ్ ఎంట్రీకి థియేటర్స్ బద్దలైపోవాలి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సామాజిక అంశాలతో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్ కీ రోల్స్ చేతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.