
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు తొంభై ఐదు శాతం షూటింగ్ పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉంది టీమ్. ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. చరణ్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తున్నట్టు తెలుస్తోంది. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ నెలాఖరులోపు మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇయర్ ఎండింగ్‌లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్‌లో ‘పుష్ప2’ రాబోతోందని ప్రకటించడంతో ఇంకా ముందే వచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దసరాకు రావాల్సిన ‘దేవర’ సెప్టెంబర్‌లోనే వస్తుండటంతో ఆ డేట్‌కు ‘గేమ్ చేంజర్’ రాబోతోందని ప్రచారం జరుగుతోంది.
ఫైనల్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.