Gaami unit at Thirumala: తిరుమలలో గామి చిత్ర యూనిట్.. అభిమానుల ఫోన్స్ లాక్కున్న విశ్వక్

Gaami unit at Thirumala: తిరుమలలో గామి చిత్ర యూనిట్.. అభిమానుల ఫోన్స్ లాక్కున్న విశ్వక్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. మార్చ్ 8న విడుదల అవగా.. మొదటోరోజు రూ.9 కోట్ల కలెక్షన్స్ రాబట్టి విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది గామి. 

ఆ తరువాత కూడా సెలవు దినాలు కావడంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది ఈ మూవీ. ఇక గామి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపధ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గామి చిత్ర యూనిట్. హీరో విశ్వక్ సేన్, దర్శకుడు విద్యాధర్, హీరోయిన్ చాందిని తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన చిత్ర యూనిట్ ను చూసి సెల్ఫీల కోసం జనాలు ఎగబడ్డారు.

ఒక్కసారిగా జనం దూసుకురావడంతో వారిలో కొంత మంది మొబైల్స్ సరదాగా లాక్కున్నారు హీరో విశ్వక్ సేన్. అలా వారిని కాసేపు ఆటపాటించారు. కొంత దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక వాళ్ళ ఫోన్స్ తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.