Meera Chopra Wedding: ప్రతి జన్మ నీతోనే..వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న మీరా చోప్రా

Meera Chopra Wedding: ప్రతి జన్మ నీతోనే..వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న మీరా చోప్రా

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా(Meera Chopra) హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో నటిస్తూ  గుర్తింపు తెచ్చుకుంది. ఈ నలభై ఏళ్ల సుందరి రక్షిత్ కేజ్రీవాల్ (Rakshit Kejriwal) అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు.

మీరా, రక్షిత్ వివాహ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 11వ తేదీనే స్టార్ట్ అయ్యాయి. మెహందీ, సంగీత్ ఫంక్షన్లు ఘనంగా జరిగాయి. మంగళవారం (మార్చి 12న) వీరి వివాహం ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జైపూర్ లో ఘనంగా జరిగింది.

అయితే మీరాచోప్రా కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా వరసకు కజిన్లు అవుతారు. చోప్రా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దఎత్తున ఈ వివాహానికి హాజరయ్యారు.  హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం రాలేదు.ప్రస్తుతం తాను ఇండియాలో లేకపోవడం వల్ల రాలేదని తెలుస్తోంది. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మీరా.

ఈ వివాహ వేడుకలో..మీరాచోప్రా రెడ్ కలర్ డిజైనర్ లెహెంగాలో చాలా అందంగా ఉంది.వైట్ కలర్ షేర్వాణీలో రక్షిత్ కేజ్రీవాల్ అదిరిపోయాడు. మీరా తన మ్యారేజ్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ..“ఇప్పటి నుంచి ఎప్పుడూ ఆనందం, గొడవలు, నవ్వులు, కన్నీళ్లు.. జీవితాంతం జ్ఞాపకాలు. ప్రతి జన్మ నీతోనే” అని రక్షిత్ కేజ్రీవాల్‍ను ఉద్దేశించి భావోద్వేగమైన క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం మీరా మ్యారేజ్ ఫొటోస్ కు బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి. ఇద్దరి జోడీ సూపర్బ్..లివ్ లాంగ్ ఫరెవర్  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మీరాచోప్రా కెరీర్ లో బంగారం సినిమా తర్వాత బెస్ట్ చిత్రం తెలుగులో వాన ఆని చెప్పుకోవొచ్చు. ఆ తర్వాత తెలుగులో నితిన్ మారో, నాగ్ గ్రీకు వీరుడు, మొగలిపువ్వు సినిమాలో నటించింది. మీరా గతేడాది సఫేద్ అనే హిందీ మూవీలో కనిపించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meera Chopra (@meerachopra)