
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. బాపూజీకి దేశవ్యాప్తంగా నివాళి అర్పిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చిం ఉంచి నివాళి అర్పించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గాంధీకి నివాళి అర్పించారు. రాజ్ ఘాట్ దగ్గర నిర్వహించిన సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.