నీ జతై సాగింది పాదమే.. ‘గాంఢీవధారి అర్జున

నీ జతై సాగింది  పాదమే.. ‘గాంఢీవధారి అర్జున

వ‌‌‌‌రుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంఢీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌‌‌‌. బి.వి.ఎస్‌‌‌‌.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘నీ జతై...’ అనే మెలోడీ సాంగ్‌‌‌‌ను విడుద‌‌‌‌ల చేశారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ఈల్వయా, నకుల్ అభయంకర్ కలిసి పాడారు. ‘నీ జతై సాగింది పాదమే.. ఆపినా ఆగునా  లోలోని వేగమే’ అంటూ  రెహమాన్ లిరిక్స్ రాశాడు.

వరుణ్, సాక్షి జంట మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. యూనిక్‌‌‌‌ స్టోరీలైన్‌‌‌‌తో వస్తున్న ఈ చిత్రంలో వ‌‌‌‌రుణ్ తేజ్‌‌‌‌, సాక్షి వైద్య స్పెష‌‌‌‌ల్ ఏజెంట్స్‌‌‌‌గా నటిస్తున్నారు. యూరోపియ‌‌‌‌న్ దేశాల‌‌‌‌తో పాటు యు.ఎస్‌‌‌‌.ఎలో షూటింగ్ చేశారు. నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానుంది.