
ములకలపల్లి,వెలుగు: భారీ వానలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువకు ఆదివారం గండిపడింది. ములకలపల్లి మండలంలోని కొత్తూరు, నాగారం గ్రామాల మధ్యలో నిర్మించిన ఈ లిఫ్ట్ కు గండిపడటంతో చింతలపాడు గుత్తి కోయ గుంపుకు వరద నీరు పోటెత్తింది. చౌటుగూడెం వద్ద ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో కొట్టుకుపోయిన రోడ్డుకు ఎంపీడీవో మహాలక్ష్మి, ఏఈ సురేష్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు.