వెళ్లొస్తా.. వచ్చే ఏటికి మళ్లొస్తా...! ఓరుగల్లులో భక్తిశ్రద్దలతో వినాయక నిమజ్జనాలు 

వెళ్లొస్తా.. వచ్చే ఏటికి మళ్లొస్తా...! ఓరుగల్లులో భక్తిశ్రద్దలతో వినాయక నిమజ్జనాలు 
  • ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు 

వరంగల్, వెలుగు:  ఓరుగల్లులో భక్తుల నుంచి నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథులు ‘వెళ్లొస్తా.. వచ్చే ఏటికి మళ్లొస్తా’ అంటూ బుధవారం ఉదయం నిమజ్జనానికి బయలుదేరారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో నిర్వాహకులు డప్పుచప్పుళ్లు, కోలాట నృత్యాలు, మంగళహారతుల మధ్య గణనాథుల శోభాయాత్ర నిర్వహించారు. ట్రైసిటీ రోడ్లన్నీ నిమజ్జనానికి తరలిన గణేశ్ విగ్రహాల వాహనాలతో నిండిపోయాయి. 

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వానల్లేక చెరువులు, కుంటల్లో నిమజ్జనానికి నీరు లేకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో భక్తులు గంగమ్మే వచ్చి తన కుమారుడిని తీసుకెళ్లినట్టుగా ఫీలయ్యారు.

గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 వేల విగ్రహాలు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 3 జోన్లలో దాదాపు 10 వేల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇందులో గ్రేటర్ వరంగల్ పరిధిలోనే సుమారు 8 వేల విగ్రహాలు ఉన్నాయి.

గణపతి నిమజ్జన డ్యూటీకి ఆరుగురు డీసీపీలు, అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 50 మంది సీఐలు, 70 మంది ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలతో పాటు ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి దాదాపు 2,100 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. ట్రైసిటీ పరిధిలోనే 1,600 మంది పోలీసులు విధులు నిర్వహించారు. శోభాయాత్రలు జరిగే ప్రధాన మార్గాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించడంతో పాటు పలుచోట్ల అత్యాధునిక డ్రోన్లను వినియోగించారు.

30 క్రేన్లు.. 145 మంది గజ ఈతగాళ్లు

నిమజ్జనం కోసం జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ఈసారి రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ లోని ప్రధాన చెరువులు, సిటీ శివార్లలోని చిన్న చెరువులను కలిపి మొత్తం 17 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు. 145 మంది గజ ఈతగాళ్లు, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ బృందాలతో పాటు 500 మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. 30 క్రేన్లను అందుబాటులో ఉంచారు. శానిటేషన్, తాగునీరు, విద్యుత్, లైటింగ్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

దంచికొట్టిన వాన..

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్​తో వర్షాలు లేక చెరువులు, కుంటల్లో వినాయక నిజ్జనం చేయలేని పరిస్థితి ఉండడంతో ఆఫీసర్లు, భక్తుల్లో ఆందోళన నెలకొన్నది. నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఆఫీసర్లు గ్రేటర్​ పరిధిలో ఈ సారి 17 ప్రాంతాల్లోనే నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అందులోనూ నాలుగైదు ప్రాంతాల్లో మాత్రమే నీరు కొంతమేర అందుబాటులో ఉంది. 

అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాన దంచికొట్టడంతో నిమజ్జన సమయానికి పలు చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆఫీసర్ల పర్యవేక్షణ..

ఓరుగల్లులో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు గ్రేటర్ పరిధిలో జీడబ్ల్యూఎంసీ, పోలీస్ కమిషనర్లు పరిస్థితిని పర్యవేక్షించారు. వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్, వరంగల్ సీపీ శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఏర్పాట్లను పరిశీలించారు. 

కడిపికొండ ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ సమీపంలోని చెరువు, హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి చెరువు, భీమారం చెరువు, గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అరెకసాయి కుంట, గుండ్లసింగారం ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువు, కట్ట మల్లన్న చెరువు, ఖిలా వరంగల్ అగర్తల చెరువు, బెస్తం చెరువు, ఉర్సుగుట్ట చెరువు, హనుమకొండ సిద్ధేశ్వర గుండం, కాజీపేట దర్గా బంధం చెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.


గణేశుడికి వీడ్కోలు

ఖమ్మంలో నిమజ్జనం కోసం 18 రన్నింగ్, రెగ్యులర్ క్రేన్లు, 2 రొటేటింగ్ క్రేన్లను అందుబాటులో ఉంచారన్నారు. మొత్తం 1,300 వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం మొత్తం 13 క్రేన్లను ఏర్పాటు చేశారు. 22 సీసీ కెమెరాలు, 350 లైట్లు ఏర్పాటు చేసి, ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు తగినంత వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టారు. 

సహాయక చర్యల కోసం ఫిషరీస్ శాఖకు చెందిన 150 మంది సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విధుల్లో నియమించారు. పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. సీపీ సునీల్ దత్, ట్రైనీ కలెక్టర్ పరాస్ కుమార్, మేయర్ పి.నీరజ, సుడా చైర్మన్ పువ్వాళ దుర్గాప్రసాద్, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. 

ములుగు జిల్లాలో 

ములుగులో వర్ష ప్రభావం ఉన్నా వినాయక మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. పోలీసు అధికారులు 300లమందితో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​, మున్సిపల్ చైర్​ పర్సన్​ చింతనిప్పుల చంద్రకళ, కమిషనర్​ జె.సంపత్​ లు నిమజ్జన కార్యక్రమాలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.