
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో అనన్య గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని లడ్డూను వేలం పాటలో తల్లపురెడ్డి శ్రావ్యరెడ్డి బ్రహ్మారెడ్డి దంపతులు రూ. 1.55 లక్షలకు దక్కించుకున్నారు. అంగోతు శిల్పానాయక్ చిన్న శ్రీరాములునాయక్ కూతురు)కలశంను పాటలో రూ. 35 వేలకు దక్కించుకున్నారు.
అరుషి గేటెడ్ కమ్యూనిటీలో గణేశ్ లడ్డూను పట్టణానికి చెందిన కోట శ్రీనివాస్‌రావు రూ. 61,116 దక్కించుకున్నారు. సాయి ప్రతాప్ నగర్గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పుచ్చకాయల రమణారెడ్డి పద్మ దంపతులు రూ.52,116 గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.
వేలంలో రూ. 1,80,016 పలికిన లడ్డు
చిట్యాల, వెలుగు : చిట్యాల పురపాలికలోని పెద్ద బావిగూడెంలోని పీజీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గణేశుని లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి చంద్రయ్య సుగుణమ్మ దంపతులు రూ. 1,80,016 రూపాయలకు దక్కించుకున్నట్లు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గణేశ్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు కమిటీ సభ్యులు యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి రవీందర్ రెడ్డి, ఎలిమినేటి నర్సిరెడ్డి, ముబీన్, తుమ్మల శివ కుమార్, భోగరాజు రాజు, తుమ్మల ఓం ప్రకాశ్, నిమ్మల సురేశ్, రమేశ్, సాయి, నాగరాజు, నవీన్, కొండ శివ , నూనె రవి, కాలనీ వాసులు పోషబోయిన సైదమ్మ, పద్మ , అంజమ్మ, నాగమణి, సుగుణ, భాగ్యలక్ష్మి, నరసింహ ఉన్నారు.