ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా వినాయక నిమజ్జనం

 ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా వినాయక నిమజ్జనం
  • గంగమ్మ  ఒడికి గణేశుడు

 వెలుగు, నెట్​వర్క్ : ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా శనివారం వినాయక శోభాయాత్రలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగా వినాయక మండపాల వద్ద ఉంచిన లడ్డూలకు వేలం నిర్వహించారు. అనంతరం విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ సంబరంగా శోభాయాత్రలు నిర్వహించారు.

 'బోలో గణేశ్​మహరాజ్​కి జై ' అంటూ నినదించారు. మహిళలు, యువతులు కోలాటాలు, భజనలు చేశారు. వివిధ వేషాలు వేసుకున్న కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయా చోట్ల నిమజ్జనానికి తీసుకెళ్తున్న రకరకాల విఘ్నేశ్వరులను చూసి భక్తులు తరించిపోయారు. పోలీస్​, మున్సిపాలిటీ, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు ఆయా జిల్లాల్లోని చెరువుల వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.