
జైపూర్: తొమ్మిదో తరగతి చదువుతు న్న బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని దుంగాపూర్ జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. నిందితుల్లో ఒకరు బాధితురాలికి తెలి సిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు. ‘‘బుధవారం ఇంటి నుంచి స్కూల్‌కు బయల్దేరిన ఆ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అపహరించారు. కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను వదిలేసి పరారయ్యారు” అని పోలీసులు తెలిపారు. నిందితుల ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.