
టూరిస్ట్ గైడ్‌పై లుటియన్స్ ఢిల్లీలో సామూహిక అత్యాచారం జరిగింది. సబ్సిడీకి లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు 27 ఏళ్ల మహిళా టూరిస్ట్ గైడ్‌పై హోటల్ గదిలో అత్యాచారం చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. టూరిస్ట్ గైడ్-కమ్-బుకింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళను.. సబ్సిడీ రేటుకు లోన్ ఇప్పిస్తామని, దాని గురించి మాట్లాడాలంటూ నిందితులు హోటల్ గదికి పిలిపించారు. అక్కడికి వచ్చిన మహిళపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై మహిళ శనివారం కొనాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు.. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ సీనియర్ అధికారి తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376డీ, సెక్షన్ 323 మరియు సెక్షన్ 34 కింద ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మనోజ్ శర్మను అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఈష్ సింఘాల్ తెలిపారు. శర్మ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని ఆయన తెలిపారు. అత్యాచారం జరిగిన గది ఇద్దరు వ్యాపారవేత్తల పేరిట బుక్ చేయబడిందని ఆయన తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని.. ఇతర నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.