నదిలో చిక్కుకున్న గంగా విలాస్.. నిజం కాదన్న ఐడబ్ల్యూఏఐ

నదిలో చిక్కుకున్న గంగా విలాస్.. నిజం కాదన్న ఐడబ్ల్యూఏఐ

ప్రధాని మోడీ గత మూడు రోజుల క్రితం ప్రారంభించిన గంగా విలాస్ క్రూయిజ్.. బిహార్ చప్రా ప్రాంతంలో చిక్కుకుపోయిందన్న వార్తల్లో నిజం లేదని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. క్రూయిజ్ షెడ్యూల్ ప్రకారం పాట్నా చేరుకుందని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారమే యాత్ర కొనసాగుతుందని ఐడబ్ల్యూఏఐ చెప్పింది. క్రూయిజ్ నదిలో చిక్కుకుపోయిందన్న వార్తల్ని నమ్మొద్దని తేల్చిచెప్పింది. 

ప్రధాని మూడు రోజుల క్రితం ప్రారంభించిన గంగా విలాస్ క్రూయిజ్ నీటి మట్టం తక్కువగా ఉండటంతో నదిలో చిక్కుకుపోయిందని వార్తలు వచ్చాయి. 51 రోజుల పాటు సాగాల్సిన యాత్ర 3రోజులకే ఆగిపోయిందని అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారని పుకార్లు షికారు చేశారు.  దీనిపై స్పందించిన ఇన్లాండ్ వాటర్ అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.