నా ఊళ్లో నాకేంటి భయం .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌‌‌‌‌‌‌‌

నా ఊళ్లో నాకేంటి భయం ..  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌‌‌‌‌‌‌‌

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. ఇందులో లంకల రత్నాకర్‌‌‌‌‌‌‌‌ అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పోషిస్తున్నాడు విశ్వక్. శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను ఆర్టీసీ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌లోని ఓ థియేటర్‌‌‌‌‌‌‌‌లో లాంచ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో వన్‌‌‌‌ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పాడు విశ్వక్ సేన్. 

ఎన్నికల్లో డబ్బు, మందు పంచుతూ అడ్డ దారిల్లో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే యంగ్‌‌‌‌ పొలిటీషియన్‌‌‌‌ పాత్రలో కనిపించాడు విశ్వక్ సేన్. తన ఆవేశం కారణంగా ఎలాంటి పరిస్థితులను అతను ఎదుర్కొన్నాడు.. అప్పటికే రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్థులను ఎలా ఎదిరించాడు అనేది ప్రధాన కథగా అర్థమవుతోంది. 

తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అంటే.. నా ఊళ్లో నాకేంటి భయం అంటాడు విశ్వక్.  ‘మనుషులు మూడు రకాలు.. ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయ నాయకులు’ అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు హైలైట్‌‌‌‌గా నిలిచింది.  విశ్వక్‌‌‌‌ లవర్‌‌‌‌‌‌‌‌గా నేహాశెట్టి, సినిమాకు ఎంతో కీలకమైన పాత్రలో అంజలి కనిపించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.  మే 31న సినిమా విడుదల కానుంది.